అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొనటంతో విమానం ఇంజినులో మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్ అత్యవసరంగా విమానాన్ని కొలంబస్ నగరంలోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.