అయోధ్యలోని నూతన రామ మందిరాన్ని చూసే భాగ్యం కలుగుతుందో లేదోనన్న ఓ తల్లి మాటలకు ఆమె కుమారుడు చలించిపోయాడు. దీంతో నూతన రామాలయం నమూనాను టేకుతో తయారుచేసి తల్లికి కానుకగా అందించారు. ఏపీ స్టేట్ అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరుకి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు యశోదమ్మ శ్రీరాముడి భక్తురాలు. ఆమె కుమారుడు లక్ష్మీనారాయణ మూడు నెలలపాటు శ్రమించి ఆలయ నమూనాను తల్లికి కానుకగా అందించగా ఆమె ఆనందంతో ఉప్పొంగింది.