వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పాం సాగు చేయడంతో రైతుకు అధికంగా లాభం చేకూరుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే ఆయిల్ పాం సాగుతో ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ పంటతో సుమారు 30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. మొక్కల మధ్య అంతరపంటలు సాగు చేయడంతో అదనపు లాభం పొందవచ్చు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ఈ పంటకు బ్యాంకుల ద్వారా రుణ సాయం అందుతోంది.