ఈపూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త దాడి చేసిన సంఘటన మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కన్నెబోయిన శ్రీనివాసరావు, భార్య మంగమ్మలు ఆస్తుల విషయంలో గొడవలు పడ్డారు. ఆ సమయంలో శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న కత్తితో భార్య మంగమ్మ చేతి పై కోశాడు. గాయపడిన మంగమ్మ ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విప్పర్ల వెంకటరావు తెలిపారు.