చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్థానిక పాత జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ రీశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10: 30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తామని తెలిపారు. పోలీసు శాఖ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న వారు, పోలీసుల నుంచి న్యాయం కావాలనుకునే వారు నేరుగా వచ్చి సమస్యలను విన్నవించుకోవచ్చు అన్నారు.