తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్‌ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్‌కు అప్పగించారు ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్‌సైట్‌పై విచారణ ప్రారంభించారు. ఇప్పటికే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది. అధికారిక వెబ్సైట్ ఉండగా, చిన్నపాటి మార్పులతో కొందరు వ్యక్తులు మార్చడాన్ని టీటీడీ గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది. నకిలీ వెబ్సైట్లను నమ్మి భక్తులు మోసపోవద్దని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.