నేడు అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వివేకా కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డిని ఆరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ రోజు (ఏప్రిల్ 24) వరకూ ఆరెస్ట్ చేయొద్దని తీర్పు ఇస్తూనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలోనే నేడు సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.