పల్నాడు జిల్లా, సత్తెనపల్లి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రానున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణలతో కూడిన ఫ్లెక్సీలు సత్తెనపల్లి మొత్తం వెలిశాయి. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ మునిసిపల్ శాఖ అర్ధరాత్రి పోలీసులతో వెళ్లి వాటిని తొలగించేసింది. ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.