అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయనను పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. జేసీ నివాసం చుట్టుపక్కల బ్యారికేడ్లు పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఐనప్పటికీ జేసీ గృహ నిర్బంధం తప్పించుకుని జేసీ ప్రభాకర రెడ్డి రోడ్డెక్కి పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.