మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులుగా అరెస్ట్ కాబడిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఆరవ రోజు ఇద్దరి సీబీఐ విచారణ మొదలైంది. ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న సీబీఐ అధికారులు.. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను సీబీఐ కార్యాలయానికి తీసుకువచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ భాస్కర్‌రెడ్డి లోపలికి వెళ్లారు. అనంతరం ఆరవ రోజు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల కస్టడీ విచారణ ప్రారంభమైంది. కాగా నేటితో భాస్కర్‌రెడ్డి కస్టడీ విచారణ ముగియనుంది.