కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈరోజు జరగాల్సిన ఏపీ భవన్ విభజనపై సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఈనెల 26న (బుధవారం) కేంద్ర హోం శాఖ కార్యాలయం నార్త్ బ్లాక్‌లో సమావేశం జరుగనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (సెంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం) సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన సమావేశం జరగనుంది. బుధవారం జరిగే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులకు హోంశాఖ అధికారులు సమాచారం పంపించారు. ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె రామకృష్ణ రావు హజరవుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్ 10 ఏళ్ళలో విభజన కావాల్సి ఉంది. ప్రస్తుతం 48శాతం తెలంగాణ, 52 శాతం ఏపీ వాటాగా ఆస్తులు పంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలు ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.