తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేసే సులభ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చలాంటూ తమ విధులు బహిష్కరించారు. చాలీచాలని జీతాలతో, కుటుంబాలు గడవటం కాస్తగా ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. నిన్న కూడా కార్మికులు తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఇవాళ తిరుమల కొండపై విధులకు గైర్హాజరయ్యారు. అయితే శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కాగా సులభ కార్మికులు సమ్మె కొనసాగిస్తే.. ఎస్మా చట్టాని ప్రయోగించే యోచనలో టీటీడీ అధికారులు ఉన్నట్లు సమాచారం.