దేశ సంపదను సంపన్నుల చేతిలో పెట్టిందే కాకుండా, అడిగిన రాహుల్ గాంధీని ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని మాజీ ఎంపీ చింతామోహన్ ప్రశ్నించారు. ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్‌గాంధీ కుమారుడి పై కక్ష సాధింపా అని ప్రశ్నించారు. ఆస్తులు త్యాగం చేసిన కుటుంబాలను మోడీ, అమిత్ షాలు అవమానించారని మండిపడ్డారు. న్యాయస్థానాల పని తీరు కూడా చాలా బాధాకరంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల తరహాలో కొంతమంది న్యాయ స్థానాల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో రాసిచ్చింది... సూరత్ కోర్టులో చదివారన్నారు. రాహుల్ గాంధీ చేసిన తప్పేంటి.. నీరవ్ మోడీ, లలిత్ మోడీ మోసం చేయలేదా అని నిలదీశారు. రాహుల్ గాంధీ ఆ ఇంట్లో ఉంటే మీకేంటి ఇబ్బందన్నారు. వెంకయ్య నాయుడికి వేల కోట్లు ఆస్తులు లేవా అని అడిగారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు.