ఛతీస్ఘడ్లో ఇటీవల పెళ్లి మండపంలోనే వధూవరులపై యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి వరుడి మాజీ ప్రేయసినే చేసిందని తెలిసింది. దమృధర్ బఘెల్, నిందితురాలు ఏడేళ్లు ప్రేమించుకున్నారు. తాజాగా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేయసి పెళ్లి మండపంలోకి వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి కరెంట్ పోవటంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను వధూవరులపై పోసి పరారైంది.