గంగా పుష్కరోత్సవాలు మే 3 వరకు జరుగుతాయి. ఈ పుష్కర ఘాట్లలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నీటిని కలుషితం చెయొద్దు. నాణాలు, వస్తువులు నీటిలోకి విసరకూడదు. వ్యర్థాలను వదలొద్దు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నదీజలాలను కలుషితం చేస్తే పాపం చుట్టుకోగలదు. నదీ స్నానానికి షాంపు, సబ్బులు వాడకూడదు. కేవలం నీటిలో మునిగి తేలితేనే పవిత్రం. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్నందున రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండకూడదు.