ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుత మద్యం విధానంలో కీలక మార్పులు,,, సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 24, 2023, 10:03 PM

తమిళనాడులో 1981లో మద్యం విధానాన్ని రూపొందించారు. దానికి తాజాగా సవరణలు చేస్తూ.. స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చేసిన సవరణల ప్రకారం.. ఇళ్లలో చేసుకునే విందులు, వేడుకలు సహా వాణిజ్యేతర ప్రదేశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో అతిథులకు మద్యం అందించడానికి లైసెన్స్‌ తీసుకోవాలని కండీషన్ పెట్టారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, సంబరాలు, పండుగలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే అతిథులకు మద్యం అందించాలంటే లైసెన్స్‌ తప్పనిసరి చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.


లిక్కర్ పాలసీలో మార్పుల ప్రకారం.. లైసెన్స్‌ అనుమతుల కోసం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో లక్ష రూపాయలు, మున్సిపాలిటీల్లో 75 వేలు.. ఇతర ప్రాంతాల్లో 50 వేల వరకు వార్షిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక రోజుకు అయితే.. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 11 వేలు, మున్సిపాలిటీల్లో 7 వేల 500, ఇతర చోట్ల 5 వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే.. తమిళనాడులో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ప్రయత్నించిన గత ప్రభుత్వాలకు భిన్నంగా.. స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.


గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత.. 2016లో 500 మద్యం షాప్‌లను మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల సమయాన్ని కూడా తగ్గించారు. జయలలిత మరణం తర్వాత పగ్గాలు చేపట్టిన పళని స్వామి కూడా ఆ విధానాన్నే కంటిన్యూ చేశారు. 2017లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 500 మద్యం దుకాణాలను మూసివేశారు. అలాంటి రాష్ట్రంలో తాజాగా స్టాలిన్ సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.


లిక్కర్ పాలసీలో స్టాలిన్ తీసుకొచ్చిన మార్పులపై ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు స్టాలిన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తాము మద్య నిషేధం కోసం పని చేస్తే.. స్టాలిన్ మాత్రం మరింత విస్తృతం చేస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే.. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే సమర్ధిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com