ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలం రాయవరానికి చెందిన బండారు అంజమ్మ అనే మహిళా స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆవేదన చెందుతుంది. తన స్థలాన్ని ఇప్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్షను చేపట్టారు. తనకు రాయవరంలోని 253/02 సర్వే నెంబరులో 12.50సెంట్ల స్థలం ఉందన్నారు. వీరయ్య అనే వ్యక్తి తన తలపై కర్రతో కొట్టి తాను స్పృహ కోల్పోయిన తర్వాత నా వేలిముద్రలు తీసికొని పాత స్టాంపుల మీద వేసుకున్నాడని ఆరోపించారు. స్థలం అమ్మినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. తన ఆస్తి తనకు దక్కేలా న్యాయం చేయాలని కోరారు. తనకు ఏదైనా జరిగితే వీరయ్య కుటుంబమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.