అన్ని రంగాలలో విఫలమైన సీఎం, జగన్ మోహనరెడ్డి పరిపాలన గురించి సామాన్యులకు సామాజికమాథ్యమాల ద్వారా తీసికెళ్ళాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం తెనాలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో సామాన్యుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడని, మహిళలు ఐతే ఆడపడుచులకు సోదరుణ్ణి అన్నందుకు ఓటు వేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం అనే భావనలో ఉన్నారన్నారు, ఇదే అవకాశంగా ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక దోపిడీ విధానాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని అలానే ప్రతి ఇంటికి గత టీడీపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ప్రస్తుతం జగన్ ప్రభుత్వం సంక్షేమమని చేస్తున్న నిలువు దోపిడీని ప్రజలకు అర్థమయ్యే విధంగా చేరువ చేయాలన్నారు.
కార్యక్రమంలో తెనాలి, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, కేశన కోటేశ్వరరావు, చిన్న కోటిరెడ్డి, వంగా సాంబి రెడ్డీ, అమృతరాజు, కంచర్ల ఏడుకొండలు, పెండేల వెంకట్రావు, ఈధర పూర్ణచంద్, డా. వేమూరి శేష గిరిరావు, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివి అనిత, రావి తేజ, నలుకుర్తి విజయ, జొన్నాదుల మహేష్, రావి చిన్ని, గోవర్ధనరెడ్డి నాసర్, మొహిద్దీన్ నలుకుర్తి రమేష్ , శరత్ తదితరులు పాల్గొన్నారు.