ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న బిజెపి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2023, 12:27 PM

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో చేబ్రోలులో సోమవారం ప్రచార భేరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దండ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు తిప్పి కొట్టకపోతే ప్రజల మనుగడకే ప్రమాదం వస్తుందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించడమే ప్రధాన ఏజెండాగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రచార భేరి గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హనుమంతరావు , చౌడయ్య, మస్తాన్వలి, షరుద్దీన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com