వైయస్ జగన్ కు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి పెట్టని కోటగా ఉన్న దళితులకు అందుతున్నప్రయోజనాలను ప్రజలలోకి తీసుకువెళ్తూ రానున్న ఎన్నికలలో తిరిగివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసేలా చేయాలని పార్టీ ఎస్సీ ముఖ్యనేతలు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దళితులను రాజకీయంగా, ఆర్దికంగా, విద్యాపరంగా సామాజికంగా పైకి తీసుకువచ్చేందుకు అమలు చేస్తున్న పధకాలు,తీసుకున్ననిర్ణయాలు,వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లి ఆయా వర్గాలను చైతన్యపరచటం, తెలుగుదేశం పార్టీ,చంద్రబాబు,పచ్చమీడియా ఇతర పక్షాలు దళితులపై దాడులంటూ దుష్ప్రచారం చేయడాన్ని ఎలా తిప్పికొట్టాలి. చంద్రబాబు హయాంలో దళితులను ఏ విధంగా అవమానాలకు గురిచేసింది. దాడులు,అత్యాచారాలకు పాల్పడింది.దళితుల భూములను కబ్జాచేసింది. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు,ఇటీవల దళితులను అవమానపరిచేవిధంగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, మంత్రి ఆదిమూలపు సురేష్ పై చంద్రబాబు సమక్షంలో జరిగిన దాడి తదితర అంశాలపై చర్చించారు.