దళితులను అపహస్యం చేస్తున్న చంద్రబాబులాంటి దుష్టుడ్ని పల్లెల్లోకి రానీయద్దని రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి కే.నారాయణస్వామి,మంత్రులు, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, పినేపి విశ్వరూప్ పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగానికి చెందిన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి, రాష్ర్ట మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, పినిసే విశ్వరూప్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ అనుభంధ సంఘాల రాష్ట్ర కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్లమెంట్ సభ్యులు, పలువురు శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు,పార్టీ జిల్లా ఎస్సీ విభాగాల అధ్యక్షులు,వివిధ నగరాల మేయర్లు,డిప్యూటి మేయర్లు,నామినేటెడ్ పదవులు పొందిన ఎస్సీ నేతలు హాజరయ్యారు.