ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమర్జెన్సీ సర్వీసెస్‌కు కాల్ చేసి,,,యూపీ సీఎం యోగికి బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2023, 10:03 PM

మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామని.. బెదిరింపు కాల్ వచ్చింది. ఈ త్రెట్ కాల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో యూపీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోలీస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఏర్పాటు చేసిన 112 నంబర్‌కు దుండగుడు కాల్ చేశాడు. త్వరలో సీఎం యోగిని హత్య చేస్తానని చెప్పాడు. దీంతో 112 ఆపరేషన్‌ కమాండర్‌ సుశాంత్‌.. గోల్ఫ్‌ సిటీ ఠాణాలో కేసు నమోదు చేశారు.


అయితే.. ఈ కాల్ చేసింది.. రిహాన్‌ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. రిహాన్ ఎవరు.. ఎందుకు ఫోన్ చేశారు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అనే కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. యోగి సీఎం అయ్యాక.. మాఫియా, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపారు. 2017 నుంచి ఇప్పటి వరకు 178 మంది క్రిమినల్స్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో లేపేశారు. అలా ఎన్ కౌంటర్లలో చనిపోయిన వారికి సంబంధించిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com