ఏపీలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఇకపై శనివారం సైతం పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారుల వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతి సేవా కేంద్రాలు శనివారం సైతం పనిచేస్తాయని, ప్రతి శనివారం 2,200 స్లాట్లను విడుదల చేయనున్నట్లు అదికారులు తెలిపారు.