దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80 పాయింట్ల స్వల్ప నష్టంతో 60,048 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 17,732 వద్ద కొనసాగుతోంది. భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఆటో, హిందాల్కో, దివిస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.