రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి చిరుధాన్యాలు పంపిణీ చేయనుంది. తొలుత రాయలసీమ జిల్లాలో సరఫరాకు శ్రీకారం చుట్టునున్నారు. ఖరీఫ్ నుంచి మిల్లెట్ల సాగును ప్రోత్సహించేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే సీజన్లో రైతుల నుంచి మద్దతు ధరకు కందులు కొనుగోలు చేయనున్నారు. కిలో కందిపప్పు ధర రూ.130లుగా ఉండగా, ప్రభుత్వం సబ్సిడీపై రూ.67కే అందజేయనుంది.