గ్రానైట్ ఫ్యాక్టరీ లీజు వ్యవహారంలో లీజుదారుడు, కఠారి కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన వివాదంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు టూటౌన్ సీఐ మద్దయ్యాచ్చారి మంగళవారం తెలిపారు. బంగారుపాళ్యం మండలం బలిజపల్లి వద్ద కఠారి కుటుంబానికి చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీని రాజస్థాన్‌కు చెందిన వినోద్, అశోక్ లీజుకు తీసుకున్నారు. ఫ్యాక్టరీలో నష్టం రావడంతో వినోద్ రాజస్థాన్‌కు వెళ్ళిపోయాడు. మరో పార్టనర్ ఐన అశోక్ కూడా లీజును రద్దుచేసుకుంటామని చెప్పడంతో తమకు రావాల్సిన డబ్బులను సెటిల్ చేసి రద్దుచేసుకోవాలని కఠారి కుటుంబసభ్యులు సూచించారు. ఈ నేపథ్యంలో అశోక్‌ను కఠారి లావణ్య, ఆమె భర్త కిరణ్, ప్రసన్న కలిసి సంతపేటలోని ఓ ఇంట్లో పెట్టి తాళం వేశారిని పోలీసులకు ఫిర్యాదు అందింది. టూటౌన్ పోలీసులు అశోక్‌ను విడిపించి, ఇందుకు కారణమైన లావణ్య, ఆమె భర్త కిరణ్, ప్రసన్నపై కిడ్నాప్ కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు.