తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి నేరుగానే భక్తులను అనుమతిస్తున్నారు. నిన్న (మంగళవారం) స్వామివారిని 62,971 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారిని 25,574 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నేడు, రేపు ఆన్‌లైన్‌లో వసతి గదుల కోటా విడుదల కానుంది.