చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసారు. ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌కు ర్యాలీగా బయలుదేరిన టీడీపీ శ్రేణులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీచార్జి జరిగింది. అయినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా ఆర్టీసీ బస్టాండువైపు పరుగులు తీశారు. మరికొంతమంది అర్బన్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి వైసీపీ నేతల అరెస్టును డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అక్కడే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య మరోసారి తోపులాట చోటుచేసుకుంది. పోలీసులను తప్పించుకుని టీడీపీ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశాయి.