నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతినగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయం 12వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... విలువలతో కూడిన విద్యకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పాఠశాలలు పని చేయాలని పిలుపునిచ్చారు. మన దేశ భవిష్యత్ యువత భుజస్కంధాలపైనే ఉందన్నారు. పర్యావరణాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు.