ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు `జగనన్న వసతి దీవెన` నగదు విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పల వేదికగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఇచ్చిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్లో భాగంగా సీఎం వైయస్ జగన్ `జగనన్న వసతి దీవెన` అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు.