కందుకూరు మండలంలోని కొండి కందుకూరులో బావిలో పడి బాలిక (15) మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన లావణ్య మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులు గాలింపు ప్రారంభించారు. మధ్మాహ్ననికి లావణ్య సమీపంలోని పొలాల్లో శవమై తేలటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శివనాంచారయ్య ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించారు. లావణ్య ఇటీవలే పదవ తరగతి పరీక్షలు రాసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లావణ్య ప్రమాదవశాత్తు బావిలో పడిందని గ్రామస్థులు భావిస్తుండగా, తండ్రి మద్యానికి బానిస కావడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.