ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డులో రూ. 10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగానే ఈ రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అగ్గారపు శ్రీనివాసులు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, కోఆపరేటివ్ స్టోర్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, కసిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, గుమ్మళ్ల పద్మ, పార్వతి, ఏఈ ఉమా, తదితరులు పాల్గొన్నారు.