మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని, ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, రక్షణ, ఎల్ఐసి, బ్యాంకులు, ఓడరేవులు, వ్యవసాయం కార్పోరేట్ వ్యక్తులైన ఆదాని, అంబానీలకు గంపగుత్తగా అమ్మేస్తున్నారని బుధవారం జరిగిన సిపిఐ - సిపిఎం జీపు జాతాలో సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి మహేష్ అన్నారు. దేశ సంపదను ఆదాని అంబానీ లాంటి దొంగల చేతిలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ హటావో, దేశ్ కో బచావో నినాదంతో ప్రజలందరూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో కోట్లకు పడగలెత్తిన కుబేరులకు తప్ప సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని రైతులు, కార్మికులు, యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మోదీ పాలనపై విసుగెత్తిపోయారన్నారు. జీపు జాత రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలో చెన్నకేశవ దేవాలయం దగ్గర నుండి ప్రారంభమై ఓబులవారిపల్లి, చిన్నవరంపాడు, రెడ్డిపల్లి, పుల్లంపేట, రాజంపేట నుండి పెనగలూరు మండలం, నందలూరు తదితరు పంచాయతీల్లో జీబు జాత నిర్వహించారు.