పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరమణ ఇటీవల స్వర్గస్తులైనారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని పాయకరావుపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్లిక్ ప్రచారవింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి బాబా, జడ్పిటిసి లంక సూరిబాబు, ఎంపీపీ తాతారావు, ఉప సర్పంచ్ జగతా శ్రీను, సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్ జానాపరెడ్డి శేషారత్నం, లెదర్ కార్పొరేషన్ వేమగిరి లక్ష్మణరావు, సాలిక్ అచీలు, జొన్నకూటి సూరిబాబు, గృహసారధిలో కన్వీనర్లు కలిసి స్వాగతం పలికారు.