వీరులపాడు మండలంలోని చౌటపల్లి గ్రామంలో గురువారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి ఇంటికీ తిరుగుతూ 2ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడి సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఆయా గ్రామాల్లోనే జగనన్న కాలనీల పేరిట అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం అందజేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహకారం కూడా అందజేసారని చెప్పారు, జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం మహా యజ్ఞంలా సాగుతుందని జగనన్న కాలనీలు కొత్త ఊర్లను తలపిస్తున్నాయన్నారు. ప్రతి మహిళకు సొంత అన్నలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇల్లు అనే ఆస్తి కల్పించి భరోసా ఇచ్చారని చెప్పారు, గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ప్రజలకు సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవని, పేదలు మరింత పేదరికంలోకి వెళ్లేలా చంద్రబాబు నాయుడు పాలన సాగించారని, అమరావతిలో పేదలు ఉండకూడదని, కోర్టుకు వెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందని, అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే సామాజిక అసమానతలు వస్తాయని, కేవలం డబ్బున్న అగ్రవర్ణాలు మాత్రమే అమరావతిలో ఉండాలని చెప్పిన చంద్రబాబు నాయుడు కాలగర్భంలో కలిసిపోయారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు నాయుడు కి బుద్ధి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ కోట సంగయ్య, ఎంపీపీ కోటేరు లక్ష్మీ ముత్తారెడ్డి, జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం, మండల పార్టీ కన్వీనర్ ఆవుల రమేష్ బాబు, సర్పంచ్ పల్లె పోగు పుల్లయ్య, ఎంపిటిసి పల్లె పోగు మార్తమ్మ, సొసైటీ అధ్యక్షులు కోట రామారావు, వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.