మహారాష్ట్రలోని ముంబై-పుణె జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ఏడు వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జు కాగా, నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఖొపోలి వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa