ములకలచెరువు మండలం నల్లగుట్టలో టీడీపీ మండల కన్వీనర్ పాలగిరి సిద్ధ ఆధ్వర్యంలో గురువారం ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై పెంచిన పన్నులు, నిత్యవసరాల ధరలు, గ్యాస్, కరెంట్, బస్ చార్జీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసిపీ ప్రభుత్వాన్ని సాగనంపి టీడీపీని గెలిపించాలని కోరారు.