విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకు త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సాయంత్రం సమయంలోని అన్నదానం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. భక్తుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. భక్త జన దర్బార్ ప్రతి నెలా రెండవ గురువారం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దాతలకు నెలకు ఒకసారి అంతరాలయ దర్శనం కల్పిస్తున్నామన్నారు. కొండపై భాగంలో విధంగా కొండ దిగువున పొంగళ్ల షెడ్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని మే 12 నుంచి 15 వరకు విజయవాడలో మహాయగ్నం నిర్వహిస్తున్నామని చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు.