నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. సంగం ప్రాంతానికి చెందిన15 ఏళ్ల బాలికపై పట్టపగలే నడివీధిలో అత్యాచారయత్నం జరిగింది. బాలిక షాప్‌కు వెళ్లి తిరిగొస్తుండగా రమేశ్ అనే యువకుడు బైక్‌తో అడ్డగించాడు. బాలిక ప్రైవేటు భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా తన బండిపైకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా, ఆమె తప్పించుకుని ఇంటికి పారిపోయింది. బాలిక తల్లిదండ్రులు నిందితుడిని నిలదీయగా వారిపైనా అతడు దాడి చేశాడు.