నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలోని అనికేపల్లి నుంచి తిరుమలకు శుక్రవారం వేకువజామున 3 గంటలకు టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. రాజాయాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందాలని కోరుకుంటూ తిరుమలకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట మస్తానయ్య, పెంచలయ్య, హరికృష్ణ, పవన్‌కుమార్, బాబి, లోకేష్, హరిప్రసాద్, సురేష్, వెంకటేశ్వర్లు, ఆనంద్ తదితరులు ఉన్నారు.