చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు, లోకేశ్ దిష్టిబొమ్మల దహనానికి నిరసనగా ఈ నెల 25న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్న టీడీపీ కార్యకర్త జగన్ ఇంటిపై సుమారు 30-40 మంది రాళ్లతో దాడిచేశారు. తలుపులు, కిటికీలు, ఇంట్లోని బీరువాలు పగులగొట్టారు. ఈ దాడిలో జగన్, ఆయన కుటుంబ సభ్యులు తిమ్మోజమ్మ, దుర్గ, దిలీప్, దివాకర్, విక్రాంత్ గాయపడ్డారు. బాధితులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నాయకులు పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.