సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కొండంరాజుపల్లి గ్రామానికి చెందిన బండి బాల కొమురయ్య (52) అప్పుల బాధతో శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ తెలిపారు. భార్య మీద ఉన్న 2ఎకరాల అసైన్డ్ భూమిలో నీటి కోసం పేరు బోర్లు వేసి అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు ఏడాది క్రితం కుమార్తె పెళ్లికి అప్పులు చేశాడు. ప్రైవేటు చిట్టీలు, అప్పులు తీర్చలేక మనస్థాపంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.