అరకులోయ పట్టణంలో షార్ట్ సర్క్యూట్ తో శనివారం పల్సర్ 220 బైక్ దగ్ధమైంది. వివరాల్లోకెళ్తే అరకులోయ మండలంలోని యండపల్లివలస గ్రామానికి చెందిన ఓ యువకుడు సొంత పనుల నిమిత్తం ఎస్. కోట వెళ్లి అరకులోయ పట్టణంలోని తిరిగి వచ్చేసరికి బైక్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించి మంటలు అంటుకున్నాయి. దీనితో బైక్ పై ఉన్న యువకుడు బైక్ విడిచిపెట్టి భయంతో పరుగులు తీసి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటన చోటుకి స్థానిక పోలీసులు హుటాహుటిన చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనలో బైక్ పై ఉన్న యువకుడికి ఎటువంటి పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.