వినుకొండ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మండలంలో నెలకొన్న భూమి తగాదాలు, పొలం తగాదాలు, హద్దుల వివాదాలు తదితర రెవిన్యూ పరిధిలోకి వచ్చే సమస్యల పరిష్కార వేదికగా శనివారం తహశీల్దార్ బి. కిరణ్ కుమార్ రెవిన్యూ కోర్టు నిర్వహించారు.
ఈ రెవిన్యూ కోర్టు నందు భూ వివాదాల పిర్యాదు చేసిన ఇరు పక్షాల వాదనలను విని వారికి ఉన్న భూమి హక్కు పత్రాలను పరిశీలించి ఆయా గ్రామ రెవిన్యూ రికార్డులు వి ఆర్ ఓ ల సహకారంతో తనిఖీ చేసి వివాద పరిష్కారానికి సలహాలు సూచనలు చేశారు.