రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా 40 లక్షల మంది మహిళలకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మూడేళ్ల ఇంటర్నెట్ ప్యాక్‌తో కూడిన ఉచిత స్మార్ట్ఫోన్లను మహిళలకు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే చిరంజీవి హెల్త్ స్కీమ్ కింద మెడికల్ కవర్‌ను రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.