మెట్రో ప్రయాణికులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 1 నుంచి ముంబై మెట్రో రైళ్లలో 25 శాతం టికెట్ రాయితీతో ప్రయాణించవచ్చని ప్రకటించింది. 65 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, 12వ తరగతి వరకు విద్యార్థులు మెట్రో లైన్ 2A, 7లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. మే 1వ తేదీన మహారాష్ట్ర అవతార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ బహుమతిని ప్రకటించారు.