ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్న గవర్నర్కు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో గవర్నర్కు వేదాశీర్వచనం చేశారు. ఈవో ధర్మారెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటాలను గవర్నర్కు అందజేశారు.