జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారు జామున 5.15 గంటలకు కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది. భూప్రకంపనలతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఐదు కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.