పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. బతికున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు అక్కడి కామాంధులు. ఈ మధ్య పాక్‌లో సమాధుల్లోని మహిళలు, వృద్ధుల మృతదేహాలపై అత్యాచారం చేసే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు వారి కుమార్తెల సమాధుల చుట్టూ ఇనుప కంచెలు వేస్తున్నారు. కాగా, పాక్‌లో ప్రతి రెండు గంటలకో మహిళ అత్యాచారానికి గురవుతోందట.