బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతిపాడు ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. సోమవారం రాత్రి ప్రత్తిపాడు మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ఎస్ఐ డి. రవీంద్రబాబు తమ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేసులు నమోదు చేశారు. గ్రామంలో రోడ్లుకు ఇరువైపులా, వ్యవసాయ క్షేత్రాలలో, మిరప కల్లాలలో పని చేసుకుంటున్న మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa